ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన ఫేక్ సీఎం…జగన్ పై నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు!

Thursday, April 1st, 2021, 11:31:15 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీ మెడ వంచి తెస్తా అన్న ప్రత్యేక హోదా ను తాకట్టు పెట్టిన ఫేక్ సీఎం జగన్ గారూ అంటూ నారా లోకేష్ అన్నారు. అయితే ఇప్పుడు బీజేపీ పుదుచ్చేరి కి ప్రత్యేక హోదా ఇస్తామంటోంది అని వ్యాఖ్యానించారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముగిసిన అధ్యాయం అయిన ప్రత్యేక హోదా పుదుచ్చేరి లో ఎలా మొదలవుతుందో అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే రాష్ట్రం లో కమలం తో రహస్య ప్రయాణాన్ని కనిపెట్టేసి, పుదుచ్చేరి లో బీజేపీ మిత్రుల గెలుపు కోసం వైసీపీ నాయకులతో విస్తృత ప్రచారం చేయిస్తున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీ కేసుల గురించి కాకుండా కాస్త ప్రత్యేక హోదా కోసం ఇప్పటికైనా గట్టిగా అడగండి అంటూ చెప్పుకొచ్చారు.

అయితే నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. బీజేపీ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పై సైతం విమర్శలు చేస్తున్నారు. మరి దీని పై వైసీపీ నేతలు, బీజేపీ ఎలా స్పందిస్తారో చూడాలి.