తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరొకసారి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఘాటు విమర్శలు చేశారు. సీఎం జగన్ ఆంధ్ర ప్రదేశ్ ను ఆత్మహత్యల ప్రదేశ్ గా మార్చేశారు అంటూ విమర్శించారు. వైసీపీ పాలనలో సామాన్యులకు రక్షణ లేదు అని నారా లోకేష్ అన్నారు.వైసీపీ నాయకుల అరాచకాలకు అడ్డు, అదుపు లేకుండా పోతుంది అని, వేదింపులకు గురిచేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కల్పిస్తున్నారు అని పేర్కొన్నారు.
అయితే చిలకలూరిపేట నియోజక వర్గం, సాతులూరు లో ఒంటరి మహిళకి జీవనాధారం అయిన హోటల్ ను వైసీపీ నాయకుడు కబ్జా చేయడానికి ప్రయత్నించడమే కాకుండా బెదిరింపులకు పాల్పడటం దారుణం అంటూ నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాలతి గారు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేశారంటే వేదింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్దం అవుతుంది అని అన్నారు. జగన్ రెడ్డి గారు ఇదేనా మహిళలకి మీరిచ్చే అభయం అంటూ నారా లోకేష్ సూటిగా ప్రశ్నించారు. మాలతి గారిని వేధించిన వైసీపీ నేతను కఠినంగా శిక్షించి మహిళకు న్యాయం చేయాలి అని నారా లోకేష్ డిమాండ్ చేశారు.
.@ysjagan ఆంధ్రప్రదేశ్ ని ఆత్మహత్యలప్రదేశ్ గా మార్చేసారు.వైకాపా పాలనలో సామాన్యులకు రక్షణ లేదు.వైకాపా నాయకుల అరాచకాలకు అడ్డు,అదుపు లేకుండా పోతుంది.వేధింపులకు గురిచేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కల్పిస్తున్నారు.(1/3) pic.twitter.com/A7irHvCLLY
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) November 25, 2020