ఇవేమీ పట్టని వైసీపీ ప్రజాప్రతినిధులు గుర్రపుస్వారీను ఆస్వాదిస్తున్నారు – నారా లోకేష్

Tuesday, May 11th, 2021, 01:08:02 PM IST

Nara_Lokesh
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై మరోమారు తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. వైసీపీ నేతల పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బెడ్లు దొరక్క బయట, బెడ్లు దొరికి ఆక్సీజన్ లేక ఆసుపత్రుల్లో ప్రజలు చనిపోతున్నారు అని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. అయితే ఇవేమీ పట్టని వైసీపీ ప్రజాప్రతినిధులు గుర్రపు స్వారీ ను ఆస్వాదిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ భారిన పడి వందల మంది చనిపోతుంటే వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం సరదాల్లో మునిగి తేలడం దారుణం అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆక్సిజన్ అందక 11 మంది మృతి చెందిన తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రి రుయా కి 60 కిలోమీటర్ల దూరంలో నది ఒడ్డున ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు, కడప మేయర్ సురేష్ బాబు గుర్రపు స్వారీ చేస్తూ ఎంజాయ్ చేశారు అంటూ నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

అయితే ప్రభుత్వానికి, వైసీపీ నాయకులకు ప్రజల ప్రాణాలు అంటే ఎంత లెక్కలేనితనమో గుర్రం మీద ఊరేగుతున్న నేతలు ఒక ఉదాహరణ అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. అయితే అందుకు సంబంధించిన ఒక విడియో ను సైతం నారా లోకేష్ సోషల్ మీడియా వేదిక గా పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియో చూసిన అనంతరం నెటిజన్లు వైసీపీ తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.