ఏపీ సీఎం జగన్ నేడు మళ్ళీ ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. అయితే జగన్ ఢిల్లీ టూర్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా ఒపీనియన్ పోల్ నిర్వహించారు. కేంద్రం మెడలు వంచుతానన్న జగన్ రెడ్డి తానే తలదించుకుని ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దలకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నదెందుకు అని ప్రశ్నిస్తూ నాలుగు ఆప్షన్స్ కూడా ఇచ్చాడు.
అయితే అందులో మొదటిది ప్రత్యేక హోదా తాకట్టు పెట్టి తనపై ఉన్న 31 కేసుల విచారణ జాప్యానికి, రెండొది రివర్స్ టెండరింగ్ లో బాబాయ్ మర్డర్ ని గుండెపోటుగా చిత్రీకరించడానికి, మూడోది మూడురాజధానుల పేరుతో అమరావతిని అంతం చెయ్యడానికి, నాల్గొది 151 దేవాలయాలపై జగన్ రెడ్డి చేసిన దండయాత్ర ఆధారాలు బయటపెట్టొద్దని వేడుకోవడానికి అని ఆప్షన్స్ ఇచ్చాడు. అయితే ఇందులో ప్రధాని మోదీకి జగన్ సాష్టాంగ నమస్కారం చేస్తున్న ఫోటోను కూడా జత చేశారు.
కేంద్రం మెడలు వంచుతానన్న @ysjagan తానే తలదించుకుని ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దలకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నదెందుకు? pic.twitter.com/zdBKijApBl
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) January 19, 2021