ఏపీలోని విజయనగరం జిల్లాలో గుర్ల పోలీస్ స్టేషన్ కి సమీపంలో డిగ్రీ చదువుతున్న యువతిపై జరిగిన దాడిపై స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జగన్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ రెడ్డి పాలనలో రోజుకో చెల్లెమ్మ బలైపోతోందని, జగన్ బుల్లెట్ లేని గన్ అని తెలిసి మృగాళ్లు రెచ్చిపోతున్నారని అన్నారు. పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలో యువతి పై అఘాయిత్యానికి పాల్పడ్డారంటే రాష్ట్రంలో ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయో అర్ధమవుతుందని వాపోయారు.
అయితే లేని దిశ చట్టం ప్రకారం కేసు నమోదు చెయ్యాలని స్వయంగా ముఖ్యమంత్రి మాయమాటలు చెప్పడం వలనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని, విజయనగరం జిల్లాలో గుర్ల పోలీస్ స్టేషన్ కి సమీపంలో డిగ్రీ చదువుతున్న యువతిపై దాడి చేసి కాళ్లు,చేతులు కట్టి నోటికి ప్లాస్టర్ వేసి తుప్పల్లో పడేసిన దారుణ ఘటన తీవ్రంగా కలచివేసిందని, యువతికి మెరుగైన వైద్యం అందించాలని, దాడి చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.
జగన్ రెడ్డి పాలనలో రోజుకో చెల్లెమ్మ బలైపోతోంది. @ysjagan బుల్లెట్ లేని గన్ అని తెలిసి మృగాళ్లు రెచ్చిపోతున్నారు.పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలో యువతి పై అఘాయిత్యానికి పాల్పడ్డారంటే రాష్ట్రంలో ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయో అర్ధమవుతుంది.(1/3) pic.twitter.com/J1hXXFtsb2
— Lokesh Nara (@naralokesh) March 1, 2021