ఆ మరణాలు ముమ్మాటికి జ‌గ‌న్‌రెడ్డి సర్కారు హత్యలే – నారా లోకేశ్

Friday, July 31st, 2020, 03:48:33 PM IST

ఏపీలోని ప్రకాశం జిల్లాలో మద్యం దొరకక కొందరు శానిటైజర్ తాగిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ఇప్పటికే 10 మంది చనిపోగా ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపై స్పందించిన నారా లోకేశ్ జగన్ గారి అస్తవ్యస్త మద్యం పాలసీ, విషంలాంటి బ్రాండ్లు ప్రజల ప్రాణాలు బలితీసుకుంటున్నాయని అన్నారు.

మద్యపాన నిషేధం అంటూ ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరిచారు. జే ట్యాక్స్ వసూళ్ల కక్కుర్తితో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నాటు సారా, శానిటైజర్ తాగి 10 మంది చనిపోవడం బాధాకరమని, ఈ మరణాలు ముమ్మూటికీ జ‌గ‌న్‌రెడ్డి సర్కారు హత్యలే అని అన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, వైకాపా లిక్కర్ మాఫియా అరాచకాలకు అడ్డుకట్ట వెయ్యాలని అన్నారు.