ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలోనే మహిళల రక్షణకు దిక్కు లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా మండిపడ్డారు. దిశ పేరుతో డ్రామాలు తప్ప ఒక్క బాధిత మహిళకూ న్యాయం జరగలేదని, రాష్ట్రంలో ప్రతి నిత్యం మహిళలపై జరుగుతున్న దాడులు చూస్తుంటే కన్నీరు వస్తుందని అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రేమోన్మాది సునీల్ ఘాతుకానికి పాల్పడటం దారుణమని మూడు నెలలుగా వేధించి ప్రేమను అంగీకరించలేడదంటూ యువతి లావణ్యపై అత్యంత క్రూరంగా కత్తితో దాడి చేసాడని అన్నారు.
అయితే మహిళల రక్షణ గాలికొదిలి రాజకీయ కక్ష సాధింపు కోసం పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చెయ్యడం వలనే ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయని, ఇప్పటికైనా మహిళల రక్షణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న మృగాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన లావణ్యకు ప్రభుత్వం మెరుగైన వైద్య సహాయం అందించాలని అన్నారు.
ముఖ్యమంత్రి @ysjagan సొంత జిల్లాలోనే మహిళల రక్షణకు దిక్కు లేదు. దిశ పేరుతో డ్రామాలు తప్ప ఒక్క బాధిత మహిళకూ న్యాయం జరగలేదు. రాష్ట్రంలో ప్రతి నిత్యం మహిళల పై జరుగుతున్న దాడులు చూస్తుంటే కన్నీరు వస్తుంది.(1/4) pic.twitter.com/WAeuR5XJb1
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) January 22, 2021