విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దు.. జగన్ సర్కార్‌పై నారా లోకేశ్ సీరియస్..!

Saturday, January 23rd, 2021, 03:15:31 PM IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జగన్ సర్కార్‌పై మరోసారి మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దు జగన్ అంటూ, విద్యార్థి లోకం తిరగబడితే నువ్వు తాడేపల్లి కోట నుండి బయటకు అడుగుపెట్టలేవు. ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని నిర్వీర్యం చేసారని, ఇప్పుడు ఏకంగా ప్రైవేట్ కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేస్తూ జీఓ 77 తీసుకొచ్చారని మండిపడ్డారు.

అయితే విద్యార్థుల భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేస్తున్న జీఓ77 ని రద్దు చెయ్యమని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపితే.. ఏపీ టీఎన్ఎస్ఎఫ్ నాయకులపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చెయ్యడం దుర్మార్గపు చర్య అని, అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించుకొని, జీఓ77ని రద్దు చెయ్యాలని అంతే కాకుండా ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని పునరుద్ధరించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.