రుయా మరణాలు ముమ్మాటికి జగన్ సర్కార్ హత్యలే – నారా లోకేశ్

Tuesday, May 11th, 2021, 03:00:32 AM IST

Lokesh

ఏపీలోని తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది పేషంట్లు చనిపోయారు. దీనిపై స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆక్సిజన్ అందక తిరుపతి రుయా ఆస్పత్రిలో సంభవించిన మరణాలు ముమ్మాటికీ జగన్ సర్కారు చేసిన హత్యలే అని అన్నారు. అత్యంత ఆధునిక సౌకర్యాలున్న రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అయిపోయేంతవరకూ పట్టించుకోకపోవడం ప్రభుత్వ పనితీరుకి అద్దం పడుతోందని, పది మందికి పైగా మృతిచెందారని తెలిసి తాను షాక్‌కి గురైనట్టు లోకేశ్ చెప్పుకొచ్చాడు.

అయితే మరో 13 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోందని, అర్జంటుగా వారికి ఆక్సిజన్ అందించి కాపాడాలని కోరుతున్నానని, ఆక్సిజన్ అందక ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా రోగులు ప్రతీరోజూ మృతి చెందుతున్నా ముఖ్యమంత్రి కనీసం ఎందుకు ఇలా జరుగుతోందని ఆరా కూడా తీయడం లేదంటే, ప్రజల ప్రాణాలంటే ఎంత లెక్క లేనితనమో స్పష్టం అవుతోందని నారా లోకేశ్ మండిపడ్డారు.