ఏడుకొండ‌ల‌వాడే కాపాడిన ప్రాణం చంద్ర‌బాబుది.. జగన్‌పై నారా లోకేశ్ ఫైర్..!

Tuesday, April 13th, 2021, 02:00:41 AM IST


తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. అయితే దీనిపై టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. తాజాగా ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్‌పై ఫైర్ అయ్యారు. ఇదే తిరుప‌తి కొండ‌పైన స్మ‌గ్ల‌ర్లు, తీవ్ర‌వాదుల‌తో క‌లిసి 24 క్లైమోర్ మైన్లు పెట్టి పేల్చితే సాక్షాత్తు ఏడుకొండ‌ల‌వాడే కాపాడిన ప్రాణం చంద్ర‌బాబు గారిది అని ఏ ఒక్క‌రూ బ‌తికే అవ‌కాశంలేని దాడి నుంచి తేరుకుని స‌హ‌చ‌రులు ఎలా ఉన్నారని వాక‌బు చేసిన‌ గుండె ధైర్యం చంద్ర‌బాబు గారిదని అన్నారు.

అయితే నీలాంటి ఫ్యాక్ష‌న్ కుక్క‌మూతిపిందెలు వేసే రాళ్లు ఆయ‌నని భ‌య‌పెట్టలేవని, జ‌గ‌న్‌ నీ ప్రిజ‌న‌రీ బుద్ధితో రాళ్లేయిస్తే, అదే రాళ్ల‌తో జ‌నానికి ప‌నికొచ్చే ఒక‌ నిర్మాణం చేయించ‌గ‌ల విజ‌న‌రీ చంద్ర‌బాబు గారిదని, తిరుప‌తిలో నా స‌వాల్‌కి తోక‌ముడిచి తొలి ఓట‌మి అంగీకరించావని, చంద్ర‌బాబు గారి స‌భ‌ల‌కు వ‌స్తున్న జ‌నాన్ని ఓర్వ‌లేక నీ రౌడీమూక‌ల‌తో రాళ్ల దాడి చేసి రెండో ఓట‌మిని ఒప్పుకున్నావు జగన్ అని అన్నారు.