అందరికీ ఒకేసారి ఆన్సర్ ఇచ్చిన ‘నారా లోకేష్’

Thursday, June 30th, 2016, 12:45:56 PM IST


తండ్రి చంద్రబాబు వద్ద రాజకీయ ఓనమాలు నేర్చుకుంటూ అప్పుడప్పుడు బయటకొచ్చే చినబాబు నారా లోకేష్ ఒక్కోసారి భలే గమ్మత్తుగా, ఘాటుగా మాట్లాడతారు. నిన్న విజయవాడలో రంజాన్ సందర్బంగా ముస్లిం ప్రజలకు తోఫా అందించే హాజరైన ఆయన విపక్షాలు చేస్తున్న పలు ఆరోపణలకు ఒకేసారి సమాధానం చెప్పారు. ప్రతిపక్షమా అనవసరంగా తనపై ఆరోపణలు చేస్తుందని, వాళ్ళు చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కదాన్ని నిరూపించినా తాను జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు.

అమరావతిని స్విస్ ఛాలెంజ్ పద్దతిలో అభివృద్ధి చేయడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయని, ఇప్పటి వరకూ జరిగిన అభివృద్ధిలో ఏమాత్రం భాగస్వామి కాలేకపోగా ప్రభుత్వ పనులకు అడ్డుపడుతోందని అన్నారు. సింగపూర్ ఏపీలో పెట్టుబడులు పెడతామని అంటే వద్దని జగన్ వాళ్లకు లేఖలు రాస్తున్నారని అన్నారు. పారదర్శక పాలన్ చేస్తున్న ప్రభుత్వంపై ఇలాంటి ఆరోపణలు మంచిది కాదని హెచ్చరించారు.