ఏపీనే ఏప్రిల్ ఫూల్‌ని చేశాడు.. జగన్ మాటలపై లోకేశ్ అల్టీమేట్ వీడియో..!

Friday, April 2nd, 2021, 01:19:01 AM IST

ఏపీ సీఎం జగన్ అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చాక మాట్లాడిన మాటలపై, ఇచ్చిన హామీలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఓ అల్టీమేట్ వీడియోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. గాలి హామీలిచ్చి గ‌ద్దెనెక్కిన గాలి మాట‌ల ముఖ్య‌మంత్రి జగన్ గాల్లో మేడ‌లు క‌ట్టి జ‌నాల్ని ఏప్రిల్ ఫూల్ చేశాడని పార్టీ పేరులోని యువ‌జ‌న, శ్రామిక‌, రైతుల్ని వంచించాడని అన్నారు. అవ్వాతాత‌ల‌కు అన్యాయం చేశాడని, మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ‌లేకుండా చేశాడని ఆ వీడియోలో ఉంది.

అంతేకాదు ప్ర‌త్యేక‌హోదాని త‌న కేసుల కోసం తాక‌ట్టుపెట్టాడని, బాబాయ్ హ‌త్య‌కేసుని నీరుగార్చాడని, సీపీఎస్ ర‌ద్దుచేస్తాన‌ని ఉద్యోగుల‌కు మాటిచ్చి త‌ప్పాడని, మొత్తంగా ఏపీనే ఏప్రిల్ ఫూల్‌ని చేశాడని, జ‌నాల్ని త‌ప్పుదారి ప‌ట్టించేందుకు కొంద‌రు ఫూల్స్‌తో త‌న కుల‌ప‌త్రిక‌లో ఏప్రిల్ ఫూల్ వార్త‌లు రాయిస్తున్న ఫేక్ సీఎం జ‌గ‌న్ రెడ్డి నాట‌క‌పు మోసాలు సినిమా చూడాల‌ని ఉంది. ఏప్రిల్ 1న విడుద‌ల చేస్తున్నాం మీరూ చూడండని లోకేశ్ ట్వీట్ చేశాడు.