మంగళగిరిలో చేనేత సొసైటీలపై జరుగుతున్న విజిలెన్స్ దాడులను టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. చేనేత సొసైటీలపై విజిలెన్స్ దాడులను ఆపాలంటూ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి లేఖ రాసానని, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చేనేత సొసైటీలపై విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయని నారా లోకేశ్ అన్నారు. అయితే చేనేత రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, కరోనా దెబ్బకి చేనేత ని నమ్ముకున్న వారి పరిస్థితి మరింత దుర్భరంగా మారిందని అన్నారు.
అంతేకాదు చేనేత కళాకారులు ఉపాధి లేక పస్తులుంటున్న సమయంలో రాజకీయ కక్షతో సొసైటీలపై దాడులు చెయ్యడం దారుణమని, ఆగష్టు 2019 నుండి ఆప్కో కొనుగోళ్లు ఆపేసింది. ఉన్న సబ్సిడీలను ఎత్తేసారు, చేనేత రంగానికి సహకారం అందించాల్సింది పోయి చేనేత వర్గంపై కక్ష సాధింపు చర్యలు మంచిది కాదు. తక్షణమే చేనేత సొసైటీల పై విజిలెన్స్ దాడులు ఆపకపోతే చేనేత వర్గంపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని నారా లోకేశ్ హెచ్చరించారు.
మంగళగిరి లో చేనేత సొసైటీల పై విజిలెన్స్ దాడులను ఆపాలంటూ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి లేఖ రాసాను. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చేనేత సొసైటీల పై విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయి.(1/3) pic.twitter.com/AWX42jm0KA
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) January 21, 2021