బిగ్ న్యూస్: రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు తెలంగాణలో కర్ఫ్యూ!

Tuesday, April 20th, 2021, 12:43:56 PM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఊహించని రీతిలో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మరణాలు సైతం భారీగానే నమోదు అవుతున్నాయి. అయితే ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. నేటి నుండి రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు పేర్కొనడం జరిగింది. అయితే మే ఒకటవ తేదీ వరకు ఈ కర్ఫ్యూ కొనసాగనుంది. అయితే రాత్రి 8 గంటల వరకే కార్యాలయాలు, దుకాణాలు, హోటళ్లు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. అయితే కర్ఫ్యూ నుండి ఫార్మసీ లు, ల్యాబ్ లు, మీడియా, పెట్రోల్ బంక్ లు, శీతల గిడ్డంగులు, గోదాములు, మరియు అత్యవసరమైన సర్వీసులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

అయితే టికెట్ కలిగిన విమాన, రైలు, బస్సు ప్రయాణికులకు కర్ఫ్యూ నుండి మినహాయింపు ఇచ్చారు. అంతేకాక వైద్యం కొరకు వెళ్ళే రోగులకు ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అయితే అంతరాష్ట్ర రవాణా కి ఎలాంటి అనుమతులు అవసరం లేదని స్పష్టం చేసింది. ఎలాంటి పాసులు కూడా అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కి పలు రాష్ట్రాలు కర్ఫ్యూ విధించాయి అని పేర్కొంది.