నీతా అంబాని కోసం ‘మనం’ ప్రదర్శన

Sunday, November 16th, 2014, 04:12:53 PM IST


రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబాని సతీమణి హైదరాబాద్ వచ్చారు. నగరానికి వచ్చిన నీతా అంబాని శనివారం సాయంత్రం చంద్రబాబు నాయుడిని కలిసి.. హుధూద్ బాధితుల సహాయార్ధం ఆమె 11,11,11,111/- రూపాయల చెక్ ను అందించారు. అనంతరం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన ద్వారా రాష్ట్ర అభివృద్ధికి సహాయపదాలని ఆమెను కోరారు. దీనిపై నీతా అంబాని సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తున్నది. ఇక నీతా అంబానితో పాటు బాలివుడ్ అలనాటి తారామణి జుహీచావ్లాకూడా బాబును కలిసిన వారిలో ఉన్నారు.

అనంతరం నీతా అంబానీ నగరంలోని అన్నపూర్ణ స్టూడియోస్ ను సందర్శించారు. అక్కినేని నాగార్జున వారికి స్వాగతం పలికి.. స్టూడియోస్ లోని వివిధ విభాగాలను వారికి దగ్గరుండి చూపించారు. అనంతరం నీతా అంబాని కోసం మనం సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు.