మహేష్ ను టార్గెట్ చేసిన నితిన్..?

Saturday, February 6th, 2016, 05:42:24 PM IST


త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వస్తున్న ప్రేమకథా చిత్రం అ.. ఆ. నితిన్, సమంతలు జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుపుకుంటున్నది. వీలైనంత త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేయాలని త్రివిక్రమ్ అండ్ కో భావిస్తున్నది. ఇకపోతే, త్రివిక్రమ్ భారీ సాహయం చేయబోతున్నాడు. నితిన్ సినిమాను ఏప్రిల్ నెలలో విడుదల చేయాలని అనుకుంటున్నాడట. అంతేకాదు.. రిలీజ్ డేట్ కూడా బయటకు వస్తున్నది. ఏప్రిల్ 22 వ తేదీన సినిమా విడుదల చేస్తారని అనధికారికంగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఇదిలా ఉంటే, ఏప్రిల్ నెలలో పెద్దహీరోల చిత్రాలు వరసగా ఉన్నాయి. ఏప్రిల్ 8న పవన్ సర్దార్ గబ్బర్ సింగ్, అల్లు అర్జున్ సరైనోడు, అలాగే 14న సూర్య 24, 29 న మహేష్ బ్రహ్మోత్సవం రిలీజ్ అవుతున్నాయి. భారీ చిత్రాలతో ఏప్రిల్ నెల మొత్తం ఇప్పటికే ప్యాక్ అయింది. ఇక ఇప్పుడు నితిన్ కూడా యాడ్ అవ్వడంతో పోటీ మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఇక మహేష్ బాబు బ్రహ్మోత్సవం విడుదలకు కేవలం వారం ముందు విడుదలవుతున్న త్రివిక్రమ్ అ ఆ సినిమా హిట్ అయితే, దాని ప్రభావం బ్రహ్మోత్సవంపై పడే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే దర్శకుడు త్రివిక్రమ్ కు మంచి క్రేజ్ ఉన్నది. ఆయన దర్శకత్వ శైలి కొత్తగా ఉంటుంది. త్రివిక్రమ్ దర్శకత్వంకోసమే చాలా మంది సినిమా చూసేందుకు వస్తుంటారు. బ్రహ్మోత్సవం సినిమా డేట్ ఎప్పుడో ఫిక్స్ అయింది కాబట్టి అది మారదు. ఏదైనా మారితే అ ఆ డేట్ మాత్రమే మారాలి. మరి అది మారుతుందో లేదంటే.. తనేమి తక్కువా అన్నట్టు బరిలో నిలబడేందుకు సై అంటుందో త్వరలోనే తేలిపోతుంది.