ఢిల్లీఎన్నికలు రిఫరెండమే అంటోన్న నితీష్

Tuesday, February 10th, 2015, 07:07:06 PM IST


ఢిల్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీహార్ జెడి (యు) అధినేత నితీష్ కుమార్ స్పందించారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు మోడీ పాలనపై రిఫరెండమే అని అన్నారు. బీజేపి నియంతృత్వ ధోరణిలో పరిపాలన సాగిస్తున్నదని అందుకే బీజేపి ఢిల్లీలో ఓడిపోయిందని అన్నారు. ఇక, ఢిల్లీ తరువాత బీజేపికి బీహార్ లో ఎదురుదెబ్బ తగలడం ఖాయమని అన్నారు. తమకు బీహార్ లో 147 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని అన్నారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బీజేపి బీహార్ లో విజయం సాధించడంతో, నితీష్ కుమార ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి.. తన స్థానంలో మన్జీ ముఖ్యమంత్రిగా నియమించారు. కాగా, ఇప్పుడు మన్జీ ప్రధాని మోడీని పొగుడుతుండటంతో… నితీష్ కుమార్ కు ఆగ్రహం వచ్చింది. మన్జీని రాజీనామా చేయాలని కోరారు. కాగ, అందుకు ఆయన ససేమిరా అనడంతో బిహార్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. నితీష్ కుమార్ తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యే లతో కలిసి గవర్నర్ త్రిపాఠిని సంప్రదించారు. కాగా, గవర్నర్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో మంగళవారం సాయంత్రం నితీష్ కుమార్ తనకు మద్దతు పలికే ఎమ్మెల్యేలను తీసుకొని ఢిల్లీ పయనమయ్యారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి తన బలాన్ని నిరూపించుకోవాలని చూస్తున్నారు. బీహార్ లో ప్రస్తుత ముఖ్యమంత్రి మన్జీ పదవి నుంచి తప్పుకొనని… ఫిబ్రవరి 20లోపు తన బలాన్ని నిరూపించుకుంటానని… ఒకవేళ నిరూపించుకోలేకపోతే పక్కకు తప్పుకుంటానని స్పష్టం చేశారు మన్జీ.