యోగా సంగతి తరువాత ముందు మందు సంగతి తెల్చవయ్యా మోదీ

Monday, June 20th, 2016, 03:08:29 PM IST


రేపు ప్రపంచవ్యాప్త యోగా దినోత్సవాన్ని మన దేశంలో అంగరంగ వైభవంగా జరపాలని ప్రధాని నరేంద్ర మోదీ భారీ ఎత్తున ప్లాన్ చేస్తుంటే బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాత్రం మోదీపై ఆ యోగాను అడ్డం పెట్టుకునే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. నిన్న జార్ఖండ్ లో ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన యోగా అంటే మద్యాన్ని పూర్తిగా మానేయాలని అలా చేస్తేనే యోగ ఫలితమని అన్నారు. ఒకవేళ మోదీ యోగాను దేశంలో వ్యాప్తిచేయాలనుకుంటే బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో సంపూర్ణ మధ్య నిషేధం పాటించి ఆ తరువాత యోగా డే నిర్వహించమని అన్నారు.

ప్రధాని ఎన్ని ఏళ్ళ నుండి యోగా చేస్తున్నారో తెలీదు కాని ఒకవైపు మధ్య విక్రయాలు చేస్తూనే మరో వైపు యోగా అనడం భావ్యం కాదని అన్నారు. అలాగే రేపు బిహార్ లో యోగా డే ను నిర్వహించకూడదని నిర్ణయించామని అలాగే జార్ఖండ్ సరిహద్దుల్లో ఉన్న మద్యం షాపుల వల్ల బీహార్ లో మధ్య నిషేధం జఠిలంగా మారిందని అన్నారు.