అక్టోబర్ 2 నుంచి నిరంతర విధ్యుత్

Monday, September 15th, 2014, 04:17:42 PM IST

chandra-babu
నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన ఏపి క్యాబినెట్ సమావేశం ముగిసింది.ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు..వందరోజుల పాలన.. రాజధాని ఏర్పాటు కోసం భూసేకరణ తదితర నిర్ణయాలను ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చించారు. దేశంలో మొదటిసారిగా ఐపాడ్..పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో జరిగిన కాగిత రహిత మీటింగ్ ఇదే కావడం విశేషం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు.

నెల్లూరు జిల్లాలో శ్రీసిటీలో హోండా కంపెనీ కోసం 600 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని నిర్ణయించింది. దీంతో అక్కడ 9వేల మందికి ఉపాది అవకాసం లభిస్తుందని ప్రభుత్వం తెలియజేసింది. ప్రతి జిల్లాలో వెటర్నరీ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్టు ఈ సమావేశంలో నిర్ణయించారు. అక్టోబర్ 2 నుంచి ఎన్టీఆర్ సుజల స్రవంతి, 24 గంటల పాటు నిరంతర విధ్యుత్ అందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. నవంబర్ 14 నుంచి రాష్ట్రంలో అన్న క్యాంటినలను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.