వైఎస్ జగన్.. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత. 2014 ఎన్నికలలో వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ లో 65 సీట్లను గెలుచుకున్నది. ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక..ప్రజా కార్యక్రమాలను రుపొందిస్తూనే.. పనిలో పనిగా ఆపరేషన్ ఆకర్ష్ ను కూడా ప్రారంభించింది. ఈ ఆపరేషన్ ఆకర్ష్ కు చాలా మంది నేతలు ఆకర్షితులైయ్యారు. ఇప్పుడు జగన్ బలం చాలా వరకు తగ్గిపోయింది. జగన్ పార్టీ నుంచి పది మంది నేతలు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు.
ఈ ఉగాదిరోజున మరికొంతమంది వెళ్తారని సమాచారం అందుతున్నది. ఇలా వరసగా వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి నాయకులు మారుతుండటంతో వైకాపా ఇబ్బందులు పడుతున్నది. అయితే, ఇప్పుడు జగన్ చేయవలసింది.. అధికార పార్టీని విమర్శించడంకాదు.. పార్టీ నుంచి నాయకులు వెళ్ళకుండా కాపాడుకుంటూనే మరోవైపు కొత్తనాయకులను పార్టీలోకి ఆహ్వానించాలి. రోజా వంటి చరిష్మా కలిగిన నేతల అవసరం వైకాపాకు ఉన్నది. జగన్ ఇక్కడ లౌక్యం ప్రదర్శించాలి. నాయకులను ఎలాగైనా పార్టీలోకి తెచ్చుకోవాలి. అప్పుడే జగన్ పార్టీ మనుగడ సాగిస్తుంది.. అధికార పక్షంతో పోరాటం చేయగలుగుతుంది.