వలసదారులపై ట్రంప్ సరికొత్త నిర్ణయం!

Thursday, June 21st, 2018, 03:11:50 PM IST

ప్రస్తుతం అమెరికాలో అక్రమ వలసదారులకు సంబందించిన వివాదాలు ప్రపంచ వ్యాప్తంగా అందరిని కదిలిస్తున్నాయి. దేశంలోకి అక్రమంగా చొరబడిన కుటుంబాలను నిర్బందించడానికి ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తల్లిదండ్రుల నుంచి వారి పిల్లలను వేరు చేయడం అందరిని కదిలిస్తుంది. ప్రపంచ దేశాలు అమెరికాపై పై విమర్శలు కురిపించాయి. మానవత్వానికి నిజంగా ఇది వ్యతిరేఖం. ట్రంప్ నిర్ణయం దాష్టీకం అని ప్రపంచ మీడియా ప్రశ్నించింది.

అయితే విమర్శలు రావడంతో ట్రంప్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కుటుంబాలను విడదీయకుండా విచారణ చేయాలనీ అధికారులను ఆదేశించారు. ఇకపోతే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఫస్ట్‌లేడీ మెలానియా ట్రంప్‌ తన భర్తను వేడుకున్నారని వైట్ హౌజ్ నుంచి ప్రకటన విడుదలయ్యింది. ఫ్యామిలీలను విడగొట్టకుండా చూడాలని ఆమె ట్రంప్ ను స్పెషల్ గా కోరారట. ఇకపోతే ట్రంప్ అందుకు తెలిపి అక్రమ వలసదారుల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదని చెప్పాడు. బార్డర్స్ లో అమెరికా భద్రతని మరింత పెంచుతున్నట్లు చెప్పారు.