ఖరీదైన భవనంతో ఎన్ఆర్ఐ రికార్డు!

Monday, January 19th, 2015, 01:29:47 PM IST


ముంబైకి చెందిన ప్రవాస భారతీయుడు అమెరికాలో అతి ఖరీదైన భవంతిని కొని రికార్డు సృష్టించాడు. కాగా చికాగోలో స్థిరపడిన ముంబై పారిశ్రామికవేత్త సంజయ్ షా తన తల్లితండ్రుల కోసం దాదాపు 104కోట్ల రూపాయలు (17 మిలియన్ డాలర్లు) పెట్టి అత్యంత ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసి రికార్డు సృష్టించాడు. ఇక చికాగోలోని 15వేల చదరపు అడుగుల స్థలంలో గల 89 అంతస్తుల భవనాన్ని సంజయ్ తాజాగా కొనుగోలు చేశాడు.

అయితే ప్రస్తుతం అతని తల్లితండ్రులు ముంబైలోని 12వేల స్క్వేర్ ఫీట్ల అపార్ట్ మెంట్ లో నివసిస్తున్నారు. కాగా సంజయ్ కి మాత్రం భారీ మొత్తంతో కొనుగోలు చేసిన ఆ భవంతిలో నివసించే ఉద్దేశ్యం లేదని తెలుస్తోంది. ఇక ఆయన తన భార్య, ఇద్దరు కూతుళ్ళతో చికాగోలోని సౌత్ బారింగ్టన్ లో ఉన్న తన పాత ఇంట్లోనే నివసించేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం.