ఆ భూతం కోరల్లో నాన్నకు ప్రేమతో..?

Saturday, January 16th, 2016, 06:11:32 PM IST

నాన్నకు ప్రేమతో.. తారక్ 25 వ చిత్రం. ఈ సినిమా జనవరి 13 న సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం క్లాస్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నది. దాదాపు 50 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో సినిమాను రూపొందించారు. పక్కా క్లాస్ చిత్రం కావడంతో.. ఏ క్లాస్ థియేటర్స్ అన్ని ఫుల్ అవుతున్నాయి. అటు ప్రేక్షకులు సైతం సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమా స్లో గా ఎక్కుతుంది అనడంలో సందేహం లేదు. హీరో విలన్ ల మధ్య మైండ్ గేమ్ తో నడిచే సినిమా కాబట్టి ఇందులో భారీ ఫైట్స్ ఉండవు. సినిమాను జాగ్రత్తగా వాచ్ చేయాలి. ఇప్పటికే ఈ సినిమా 30 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

ఇక ఇదిలా ఉంటే, పెద్ద పెద్ద సినిమా విడుదలౌతుంటే.. ఆ సినిమాలు విడుదలైన మరుసటి రోజే పైరసీ రక్కసి పంజా విసురుతుంది. ఈ పంజా దెబ్బకు నాన్నకు ప్రేమతో కూడా విలవిలలాడి పోతున్నది. నాన్నకు ప్రేమతో సినిమా పైరసీకి గురయిన్నట్టు తెలుస్తున్నది. అదీ ఇక్కడ కాదు.. ఆస్ట్రేలియాలో. ఎన్టీయార్ నటించిన ఇతర చిత్రాలైన టెంపర్, బాద్ షా సినిమాలతో నాన్నకు ప్రేమతోను కలిపి డివిడి ల రూపంలో అమ్ముతున్నారట. ఇలా ఒక్క ఆస్ట్రేలియాలోనే కాకుండా.. ఈ సీడీలు ఇతర దేశాలలోను కనిపించడంతో.. నాన్నకు ప్రేమతో టీం ఆందోళన చెందుతున్నది. పైరసీ భూతం నుంచి నాన్నకు ప్రేమతోను కాపాడాలని సుకుమార్ టీం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది.