భారత శాస్త్రవేత్తకు అమెరికా అవార్డు

Saturday, November 22nd, 2014, 02:07:02 AM IST


భారత సంతతికి చెందిన థామస్ కైలాథ్ కు అమెరికా ప్రభుత్వం అత్యున్నత పురష్కారం అందించింది. శాస్త్ర సాంకేతిక రంగంలో కృషి చేసిందుకు ఆయనకు నేషనల్ మెడల్ అఫ్ సైన్స్ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డు శాస్త్రసాంకేతిక రంగాలలో కృషి చేసిన వారికి అందజేస్తారు. 79 సంవత్సరాల థామస్ కైలాథ్, 22 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సాంకేతిక రంగంలో పరిశోధనలు చేసేందుకు అమెరికాకు వచ్చారు. కైలాథ్ శాస్త్ర సాంకేతిక రంగాలపై స్టాన్ఫోర్డ్ లో విశ్లేషనాత్మక ఉపన్యాసం ఇచ్చారని… ఇప్పటివరకు కైలాథ్ 100 స్కాలర్స్ అందుకున్నట్టు ఒబామా తెలిపారు.

సైన్స్ మరియు ఇంజినీరింగ్ రంగాలలో విశేషమైన కృషి చేసిన వారికి ప్రతిసంవత్సరం ఈ అవార్డును అమెరికా ప్రభుత్వం ఇస్తుంది. 1935లో కేరళలో పుట్టిన కైలాథ్… పరిశోధనల నిమిత్తం అమెరికా వెళ్లారు.