ప్రేమించిన వారినే పెళ్ళిచేసుకునే స్వేచ్చ ఇవ్వాలంటున్న ‘ఒబామా’

Wednesday, January 13th, 2016, 12:03:46 PM IST


నిన్న మంగళవారం అమెరికా అధ్యక్షుడు ఒబామా తన అధ్యక్ష పదవీ కాలం ముగియనుండటంతో జాతినుద్దేశించి చివరి ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో ఆయన అమెరికా ఎదుర్కొంటున్న, పరిష్కరించుకోవలసిన పలు అంశాలను ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ ‘ అమెరికాలో అన్నింటికన్నా సామాజిక భద్రత, ఆరోగ్యాలను విస్మరించకూడదు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ అమెరికాలో సాగిస్తున్న ఉగ్ర చర్యలను ఆపడమంటే ఏదో మూడో ప్రపంచ యుద్ధం చేసినట్టు కాదు.

ఇప్పటికే అమెరికా ఐసిస్ పై పై చేయి సాదించింది. అమెరికాలో పెరుగుతున్న గన్ కల్చర్ ను ఆపాలి. మన పిల్లలలకు భద్రమైన భవిష్యత్తును అందినచాలి. అమెరికాలో ప్రతి ఒక్కరికీ తాము ప్రేమించినవారినే పెళ్ళాడే స్వేచ్చ కల్పించాలి. ముస్లిం లను విస్మరించడం వల్ల, వారి మసీదులను నాశనం చేయటం వల్ల ప్రయేజనం లేదు. పదవి నుండి వైదొలగినా మరో ఏడేళ్ళు అమెరికా ప్రజల గురించే ఆలోచిస్తాను. అమెరికా ప్రజల భద్రతే అన్నిటికన్నా ముఖ్యం’అంటూ ప్రసంగించారు.