బిగ్ న్యూస్ : ఏపీలో మరోసారి భగ్గుమన్న అన్యమత ప్రచారం.!

Tuesday, July 7th, 2020, 07:03:48 AM IST

ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గా వై ఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన అనంతరం అతని ప్రభుత్వం లో కొన్ని సంచలనం రేపిన అభ్యంతరకర ఘటనల్లో అన్యమత ప్రచార ఘటన కూడా ఒకటి. అయితే ఇలాంటి ఘటనలు జగన్ అధికారంలోకి వచ్చాకే రావడం అలాగే జగన్ కూడా పర మతానికి చెందిన వ్యక్తే కావడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కేవలం ఈ అన్యమత ప్రచార అంశమే గత కొన్ని నెలల కితం ఏపీ రాజకీయ వర్గాల్లో ఈ అంశమే హాట్ టాపిక్ అయ్యింది. ముఖ్యంగా పవిత్ర తిరుమల దేవస్థానంలో అన్యమత ప్రచారాలు జరగడం, వెబ్సైట్ లలో ఏసు క్రీస్తు పాటలు వంటివి ఉండడం కలకలం రేపాయి. అయితే అప్పుడు ఎలాగో ఈ అంశం పక్కకి వెళ్లిపోయింది.

కానీ తాజాగా ఒక గుంటూరు వ్యక్తికి ఎదురైన ఘటన మరోసారి తిరుమలలో జరుగుతున్న అన్యమత ప్రచారాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. వారికి తిరుమలలో గత పదేళ్ల నుంచి సప్తగిరి మాస పత్రిక కు సబ్ స్క్రిప్షన్ ఉందని అలా ఈసారి వచ్చిన మాస పత్రిక తో పాటు అన్య మతానికి చెందిన “సజీవ సువార్త” అనే పుస్తకాన్ని చూసి తాను ఆశ్చర్యపోయానని అతను తెలిపారు. అలాగే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని అతను కోరుతున్నాడు. దీనితో ఏపీలో మరోసారి అన్యమత ప్రచార రాజకీయాలు భగ్గుమన్నాయని చెప్పాలి.