బిగ్ న్యూస్: భారత్ లో కరోనా పంజా… ఒక్క రోజే లక్షకి పై గా కేసులు!

Monday, April 5th, 2021, 11:02:18 AM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత విలయ తాండవం చేస్తోంది. మునుపెన్నడూ లేని రీతిలో దీని వ్యాప్తి కొనసాగుతుంది. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారత్ లో అడుగు పెట్టి 14 నెలలు అవుతున్నా కేసులు మాత్రం లక్ష ఏనాడూ దాటలేదు. కాగా గడిచిన 24 గంటల్లో 8,93,749 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందులో 1,03,558 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే గతేడాది 97,894 కేసులు అత్యధికం గా నమోదు కాగా, ఇప్పుడు గరిష్టంగా లక్ష కి పైగా కేసులు నమోదు అయ్యాయి. అయితే తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,25,89,067 కి చేరింది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 478 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన కరోనా వైరస్ మరణాల తో మొత్తం భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,65,101 కి చేరింది. నిన్న ఒక్క రోజే 52,847 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 1,16,82,136 కి చేరింది. ప్రస్తుతం భారత్ లో 7,41,830 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.