800ఏళ్ల తరువాత దేశంలో హిందూ పాలన : అశోక్ సింఘాల్

Sunday, December 21st, 2014, 06:16:11 PM IST


భారత దేశంలో 800 సంవత్సరాల తరువాత హిందూ పాలన వచ్చిందని విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ అన్నారు. అసలు తమ లక్ష్యం మత మార్పిడులు కాదని…. ప్రజల హృదయాలను గెలవడమే ముఖ్యమని ఆయన అన్నారు. హిందూధర్మాన్ని రక్షణకు కట్టుబడి ఉన్నామని అన్నారు. దాదాపు 800 సంవత్సరాల అనంతరం హిందువుగా చెప్పుకేనే వారు అధికారంలోకి వచ్చారని ఇది గర్వించ దగ్గ పరిణామమని అన్నారు. గత ఎనిమిది వందల సంవత్సరాలుగా మన సంస్కృతిని, సాంప్రదాయాలను అణిచివేసే ప్రయత్నం జరిగిందని ఆయన తెలిపారు. 12వ శతాబ్దంలో పృద్విరాజ్ చౌహాన్ అధికారం కోల్పోయాక మరలా ఇప్పటివరకు హిందూపాలన దేశంలో రాలేదని ఆయన తెలిపారు.