త్వరలో 500మంది టెర్రరిస్టులకు ఉరి

Monday, December 22nd, 2014, 07:53:25 PM IST


పాకిస్తాన్ ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్నది. పెషావర్ లోని ఆర్మీ స్కూల్ లో తాలిబన్ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డ అనంతరం… పాకిస్తాన్ తాలిబన్ లపై విరుచుకు పడుతున్నది. తాలిబన్ తీవ్రవాదులను నిర్మూలిస్తామని తేల్చిచెప్పింది. ఇక వివిధ వివిధ ఉగ్రవాద సంస్థలకు చెందిన దాదాపు 500మంది తీవ్రవాదులను ఉరితీస్తామని… అందుకు సంబంధించిన ఏర్పాట్లను త్వరతిగతిని పూర్తీచేసేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకొంటున్నట్టు పాకిస్తాన్ అధికారులు తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ కు చెందిన ఓ మంత్రి కూడా దృవీకరించారు. త్వరలోనే మరణశిక్షపడ్డ ఉగ్రవాదులను ఉరి తీస్తామని పేర్కొన్నారు.