మూడు రాజధానులు కాదు…వాటి పై దృష్టి సారించండి – పవన్ కళ్యాణ్

Saturday, August 1st, 2020, 01:12:17 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇటువంటి క్లిష్ట సమయంలో మూడు రాజధానుల పై నిర్ణయం సరికాదు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో రోజుకి పది వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి అని, ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని భయాందోళనల తో జీవనం సాగిస్తున్నారు అని పవన్ కళ్యాణ్ అవేదన వ్యక్తం చేశారు.

అయితే ఇపుడు ఉన్న పరిస్తితుల్లో పాలన వికేంద్రీకరణ పై కాకుండా, ప్రజలను రక్షించడానికి ప్రజా ప్రతినిదులు, మంత్రి వర్గం, అధికారులు కృషి చేయాలని కోరారు. అయితే రాజధాని రైతుల పరిస్తితి పై కూడా పవన్ జన సేన రాజకీయ కమిటీ తో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే పవన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చంశనీయము అయ్యాయి.