సీఎం జగన్‌కి అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్..!

Friday, July 3rd, 2020, 07:11:30 PM IST

ఏపీ సీఎం జగన్‌కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. తాజాగా జగన్ సర్కార్ 1088 అంబులెన్స్‌లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై పవన్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఆంంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారు, అత్యవసర సేవల్ని అందించే అంబులెన్సులిని ఆరంభించడం అభినందనీయమని అన్నారు.

అలాగే, గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో, ఏ మాత్రం అలసత్వం ప్రదిర్శించకుండా, ప్రభుత్వం పనిచేస్తున్న తీరుపై కూడా ప్రశంసలు కురిపించారు. అయితే ఇది ప్రపంచానికే గడ్డు కాలం, అందుకే ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుంటూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలికి సహకరిద్దాం క్షేమంగా ఉందామని పిలుపునిచ్చారు.