‘పవన్’ పండక్కి ‘అన్నయ్య’ దగ్గరికి వెళ్ళకపోవటానికి కారణం అదేనా..?

Wednesday, January 13th, 2016, 04:58:54 PM IST


మెగా ఫ్యామిలీకి ఓ ఆనవాయితీ ఉంది. అదే ప్రతి సంక్రాంతికీ కుటుంబ సభ్యులందరూ ఎక్కడున్నా ఒక చోట కలుసుకోవటం. ఈసారి కూడా అలాగే అందరూ సంక్రాంతికి బెంగుళూరులోని చిరంజీవి ఫామ్ హౌస్ లో కలుసుకోవాలని అనుకున్నారు. ఇందుకు పవన్ కళ్యాణ్ కు కూడా ఆహ్వానం వెళ్ళింది. కానీ పవన్ – చిరంజీవి ల మధ్య ఉన్న చిన్న దూరం వల్ల పవన్ ఆ కలయికకి వెళతారా.. లేదా అని అందరూ అనుకున్నారు.

అనుకున్నట్టే పండగ రానే వచ్చింది. అందరూ కలిశారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం బెంగుళూరు ఫామ్ హౌస్ కు వెళ్ళలేదు. ఎందుకనంటే.. సినీ వర్గాల సమాచారం ప్రకారం పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల పైగా ఆయన పిల్లలు కూడా రేణు దేశాయ్ వద్ద ఉండటం వల్ల ఫామ్ హౌస్ కు వెళ్ళలేకపోయారట. పైగా పవన్ కూడా తాను రాలేకపోతున్నట్లు అన్నయ్య చిరుకు ఫోన్ చేసి చెప్పారని సమాచారం.