సర్దార్ బాగాలేదంటే.. ఫ్యాన్స్ ఇలా చేస్తారా..?

Friday, April 8th, 2016, 05:37:44 PM IST


సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు అంగరంగ వైభోగంగా విడుదలైంది. ఈ సినిమా కోసం అభిమానులు రాత్రి నుంచే భారీగా క్యూ కట్టారు. తమ అభిమాన హీరో తెరపై కనిపించగానే విజిల్స్ తో మోతమోగించారు. ఇంతవరకు బాగానే ఉన్నది. ఫస్ట్ హాఫ్ అంతా అద్బుతంగా ఉన్నది. అయితే సెకండ్ హాఫ్ కొంచెం బోర్ కొట్టడమే కాకుండా సీన్ కు సీన్ కు మధ్య సంబంధం లేకపోవడంతో సినిమా ఫ్లాప్ టాక్ వచ్చింది. దీంతో కొంతమంది సినిమా బాగాలేదని అనే సరికి ఫ్యాన్స్ కోపంతో రగిలిపోయారు.
ఫ్యాన్స్ కోపాగ్నికి ఓ వ్యక్తి బలయ్యాడు. భద్రాచలంలో ఫ్యాన్స్ కొందరిపై విరుచుకుపడ్డారు. అకారణంగా ఓ వ్యక్తిని చితకబాదారు. దీంతో పట్టణంలో ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి.