నితిన్ సినిమాలో పవన్ గెస్ట్ రోల్..?

Friday, January 1st, 2016, 05:15:18 PM IST

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ సమంతలు జంటగా వస్తున్న చిత్రం అ.. ఆ.. ఈ సినిమా షూటింగ్ శెరవేగంగా జరుగుతున్నది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తిచేసే పనిలో పడిపోయాడు త్రివిక్రమ్. ఫిబ్రవరిలో అ ఆ ను విడుదల చేయాలని త్రివిక్రమ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ సూర్య తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఆ సినిమా రూపుదిద్దుకోనున్నది.

ఇక, త్రివిక్రమ్ శ్రీనివాస్ కు పవన్ కళ్యాణ్ కు మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. జల్సా, అత్తారింటికి దారేది వంటి సూపర్ హిట్ చిత్రాలను పవన్ కళ్యాణ్ కు అందించారు. అప్పటి నుంచి త్రివిక్రమ్.. పవన్ కళ్యాణ్ ల మధ్య అనుబంధం కొనసాగుతూనే ఉన్నది. అయితే, త్రివిక్రమ్ తీస్తున్న అ ఆ సినిమాలో పవన్ చేత గెస్ట్ క్యారెక్టర్ వేయించాలని చూస్తున్నారు. ఈ ప్రపోజల్ పవన్ వద్దకు వెళ్ళింది. ఇక, నితిన్ సైతం పవన్ కు మంచి దోస్త్. త్రివిక్రమ్ ప్రపోజల్ కు పవన్ ఒప్పుకుంటే.. అంతకంటే కావాల్సింది ఏమున్నది. సినిమాకు మంచి ప్రమోషన్ జరిగినట్టే.