కరోనా నుంచి కోలుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్..!

Saturday, May 8th, 2021, 03:51:22 PM IST

Pawan-Kalyan2
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. కరోనా బారిన పడిన పవన్ కళ్యాణ్ గారికి వైద్య సేవలు అందించిన డాక్టర్లు మూడు రోజుల కిందట ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారని, ఆ పరీక్షల్లో నెగెటివ్ వచ్చినట్టు తెలిపారు. అయితే ప్రస్తుతం కరోనా అనంతరం వచ్చే నిస్త్రాణం వంటివి మాత్రమే ఉన్నాయని, ఆరోగ్య పరంగా పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బందులు లేవని ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న వైద్యులు తెలిపినట్టు చెప్పారు.

అయితే తన ఆరోగ్య క్షేమాల కోసం ఆకాంక్షించిన వారికి, పూజలు, ప్రార్థనలు చేసిన జనసైనికులు, నాయకులు, అభిమానులకు పవన్ కల్యాణ్‌ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం దేశంలో కోవిడ్ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉన్నందున ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని, వైద్య నిపుణులు అందిస్తున్న సూచనలు అనుసరించాలని విజ్ఞప్తి చేశారు.