దమ్ముంటే పుంగనూరు లో పోటీ చేయాలి…చంద్రబాబు కి పెద్దిరెడ్డి సవాల్

Friday, February 26th, 2021, 12:36:30 PM IST

కుప్పం నియోజకవర్గం పర్యటన లో తెలుగు దేశం పార్టీ అధినేత ఉన్నారు. కుప్పం సొంత నియోజక వర్గం అయినప్పటికీ పంచాయితీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు వైసీపీ సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మేరకు రానున్న ఎన్నికల దృష్ట్యా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు కి సవాల్ విసిరారు.దమ్ముంటే చంద్రబాబు పుంగనూరు లో పోటీ చేయాలని అన్నారు. కుప్పంలో ఓడిపోయినా చంద్రబాబు కి కనువిప్పు కలగలేదు అంటూ చెప్పుకొచ్చారు. కుప్పం ఓటమితో చంద్రబాబు లో అసహనం పెరిగిపోయింది అని, కరోనా కష్టకాలం లో కూడా చంద్రబాబు కుప్పం వైపు చూడలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కుప్పం లో ఓటమి పాలు అయ్యేసరికి ప్రజలు గుర్తుకు వచ్చారు అంటూ విమర్శలు గుప్పించారు. పులివెందుల, పుంగనూరు వచ్చి చంద్రబాబు ఏం చేస్తారు అంటూ సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు అక్రమంగా మిథున్ రెడ్డి నీ 15 రోజులు జైల్లో పెట్టించాడు అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాక గతం లో చంద్రబాబు నాయుడు పథకాలు వాళ్ళ అబ్బ సొత్తు తో అమలు చేశారా అంటూ సూటిగా ప్రశ్నించారు.