ఇప్పటికే ప్రజలు టీడీపీని బహిష్కరించారు – పేర్ని నాని

Friday, April 2nd, 2021, 07:35:52 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇటీవల జరిగిన పంచాయతీ మరియు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ దారుణ ఓటమి చవి చూసిన సంగతి తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా వైసీపీ కి ప్రజలు భారీ విజయం అందించారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇంకా ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే తెలుగు దేశం పార్టీ కి ఎలాగూ ప్రజలు ఓటేయరనీ తెలిసే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తామని ఆ పార్టీ అంటోంది అంటూ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ప్రజలు టీడీపీని బహిష్కరించారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికే తెలుగు దేశం పార్టీ కి చెందిన వారు నామినేషన్లు వేశారని, ఒకవేళ ఎన్నికలను ఆ పార్టీ బహిష్కరించినా బ్యాలెట్లో టీడీపీ గుర్తు ఉంటుంది అని తెలిపారు.

నిన్నటి వరకు నిమ్మగడ్డను అడ్డం పెట్టుకొనిఆడ ఆడారు, ఇప్పుడు ఒక మంచి ఆఫీసర్ ఎన్నికల కమిషనర్ గా వచ్చే సరికి ఎన్నికలు వద్దు అంటున్నారు అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు. అయితే నారా వారి పుత్ర రత్నం ఎల్ బోర్డ్ పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఇంకో 30 ఏళ్లు అయినా ఎల్ బోర్డ్ అలానే ఉంటుంది అంటూ సెటైర్స్ వేశారు. నారా లోకేష్ ప్రత్యేక హోదా అంశం పై అధికార పార్టీ వైసీపీ పై వరుస విమర్శలు చేయడాన్ని మంత్రి పేర్ని నాని తప్పుబట్టారు. అయితే తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక లో వైసీపీ అభ్యర్ధి గెలుపు తో దేశం అంతా కూడా తిరుపతి వైపు చూసేలా ఉంటుందీ అంటూ చెప్పుకొచ్చారు పేర్ని నాని.