భారతీయులందరికీ నిరంతర విద్యుత్!

Friday, December 5th, 2014, 06:49:18 PM IST


కేంద్ర విద్యుత్ శాఖామంత్రి పీయూష్ గోయెల్ ఢిల్లీలో ‘డిజిటల్ ఇండియా కంక్లేవ్-2014’ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అందరికీ 2019 నాటికల్లా 24గంటల విద్యుత్ ను అందిస్తామని ప్రకటించారు. అలాగే ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుందని పీయూష్ గోయెల్ అభిప్రాయపడ్డారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ ఐటి ఆధారిత స్మార్ట్ గ్రిడ్ల ఆధారంతో భారతీయులందరికీ 2019కల్లా నిరంతర విద్యుత్ అందేలా చూస్తామని తెలిపారు. అలాగే బొగ్గు చౌర్యాన్ని సీసీటీవీ కెమెరాల ద్వారా నిరోధించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పీయూష్ గోయెల్ పేర్కొన్నారు. .