భారత ప్రధాని నరేంద్ర మోదీ హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, కలెక్టర్ శ్వేతా మొహంతితో పాటు పలువురు అధికారులు మోదీకి ఘన స్వాగతం పలికారు. విమానశ్రయం నుంచి నేరుగా ప్రధాని మోదీ రోడ్డు మార్గం ద్వారా జీనోమ్‌వ్యాలీకి చేరుకున్నారు. భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ పురోగతిని శాస్త్రవేత్తలతో మాట్లాడి తెలుసుకోనున్నారు.
అనంతరం 2.40 గంటలకు హకీంపేట ఎయిర్‌ఫోర్స్ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి 3.50 గంటలకు పూణేకు బయలుదేరి సీరమ్ ఇన్సిస్టిట్యూట్‌ను సందర్శించనున్నారు. ఇదే కాకుండా ప్రధాని మోదీ ఉదయం గుజరాత్‌లోని బైడస్ క్యాడిలా సంస్థను కూడా సందర్శించారు. ఆ సంస్థ తయారు చేస్తున్న జైకోవ్-డీ కరోనా వ్యాక్సిన్‌కి సంబంధించిన అంశాలను తెలుసుకున్నారు.