విశ్లేషణ : పోలవరం కాంట్రాక్ట్ లో కేసీఆర్ హస్తం..పెద్ద కుట్ర జరుగుతుందా..?

Tuesday, September 24th, 2019, 01:56:26 PM IST

తాజాగా పోలవరం ప్రాజెక్టులో మెజారిటీ పనులు ‘మేఘ’ సంస్థ దాదాపు 700 కోట్లకి తక్కువకే కోడ్ చేసి దక్కించుకుంది. అది చూసిన వైసీపీ నేతలు అహో ఓహో 700 కోట్లు ఆదా చేశాం, ఇదే జగన్ పరిపాలన అంటూ జబ్బలు చరుస్తున్నారు. కానీ అదే రంగంలో ఉన్న వాళ్లందరికీ బాగా తెలుసు అంత తక్కువ మొత్తం అనుకున్న స్థాయిలో పనులు చేయలేమని, కానీ మేఘ మాత్రం ఖచ్చితంగా చేస్తామని 700 కోట్లు తక్కువకే బిడ్ వేసింది, పనులు దక్కించుకుంది.

ఏ సంస్థ అయినా తక్కువ రేటుకి పనిచేసి ప్రజా సేవ చేయటానికి రాలేదు. 700 కోట్లు తక్కువ అంతే అది మాములు విషయం కూడా కాదు… సరిగ్గా ఇక్కడే కొన్ని అనుమానాలకు తెర లేస్తుంది. నిన్న జగన్ కేసీఆర్ భేటీ జరిగింది. అదే రోజున ‘మేఘ’కి పోలవరం ప్రధాన కాంట్రాక్టు పనులు లభించాయి. అదే రోజు తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త కమిటీ మీటింగ్ జరిగింది. అందులో 400 ఎలక్ట్రిక్ బస్సులు కొనాలని నిర్ణయం తీసుకున్నారు. పైన చెప్పిన వాటిని లింక్ చేసి చూస్తే ఇందులో పెద్ద స్థాయిలో క్విడ్ ప్రో కో జరిగినట్లు తెలుస్తుంది.

మేఘ గురించి దేశం మొత్తంలో చాలా మందికి తెలుసు. పెద్ద పెద్ద పనులు అనుకున్న టైం లో చేసిన రికార్డు దాని సొంతం. తెలంగాణాలో కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావటం వెనుక మేఘ సంస్థ కృషి చాలా ఉంది. ఆ సమయంలో కేసీఆర్ కి ఆ సంస్థ అధినేత కృష్ణ రెడ్డికి మంచి అనుబంధం ఏర్పడింది. ఆ ప్రాజెక్టు ఓపెనింగ్ రోజు స్పెషల్ గెస్ట్ గా జగన్ కూడా వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత పోలవరం నవయుగ సంస్థ కాంట్రాక్టు రద్దు చేయటం, ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కి వెళ్ళటం జరిగాయి.

అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించి అక్కడ నడిపించటానికి ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయాలనీ భావించారు. ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్న ఆ విషయాన్నీ కొత్త ఏర్పడిన బోర్డ్ మొదటి మీటింగ్ లోనే బయటకు తీసి, దానిపై చర్చించి దాదాపు 400 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో అమరావతిలో 150 కోట్లతో నిర్మించబోతున్న వెంకటేశ్వర స్వామి గుడికి కేవలం 35 కోట్లుకి మాత్రమే పరిమితం చేసి, ఒక ప్రాకారంలోనే నిర్మిస్తున్నారు.

ఇక మేఘ సంస్థ విషయానికి వస్తే కాళేశ్వరంలో ఒక క్యూబిక్ మీటర్ కి కోడ్ చేసి తీసుకున్న దానికంటే పోలవరంలో దాదాపు రెండు వేలకి తక్కువగా కోడ్ చేసింది. అయితే ఇదేమి పోలవరం మీద ప్రేమ తోనే, లేకపోతే ఇందులో లాభాలు వస్తాయనే చేయలేదు. గత కొద్దీ నెలల క్రితమే మేఘ సంస్థ చైనా కి చెందిన మరో సంస్థతో కలిసి ఎలక్ట్రిక్ బస్సులు తయారీలోకి అడుగుపెట్టింది. మరి కొద్దీ రోజుల్లో అవి మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నాయి. తిరుమలకి కొనాలనుకున్న బస్సులు మేఘ నుంచే కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఇవన్నీ చూస్తే “కేసీఆర్ జగన్ స్నేహం..కేసీఆర్ మేఘ సంస్థల మధ్య అవగాహనా..తక్కువ రేటుకే పోలవరం పనులు చేయటానికి ముందుకొచ్చిన మేఘ సంస్థ..ఎప్పటి నుండి ఆగిపోయిన ఎలక్ట్రిక్ బస్సులు ఫైల్ దుమ్ముదులిపి 400 బస్సులు కొనబోతున్న టీటీడీ”…. వామ్మో అదిరిపోయే రీతిలో లింక్స్ ఇక్కడ ఉన్నాయి.. మేఘ పోలవరం కాంట్రాక్టు లో నష్టపోతున్న డబ్బుని, ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు రూపంలో మేఘ వాళ్లకి మేలు చేసేలా జగన్ నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి మేఘ సంస్థ అక్కడ కోల్పోయేది ఏమి లేదు..

ఇవన్నీ చూస్తే పెద్ద స్థాయిలోనే క్విడ్ ప్రో కో జరిగినట్లు తెలుస్తుంది. ‘నీకది..నాకది’ అన్నట్లు సాగింది వ్యవహారం. పోలవరం రివర్స్ టెండరింగ్ విషయంలో ప్రభుత్వం మీద ఆరోపణలు వస్తున్నాయి. వాటికీ చెక్ పెట్టాలంటే రివర్స్ టెండరింగ్ లో భారీ స్థాయిలో డబ్బులు ఆదా అయ్యాయని చూపించాలి. అందుకే 700 కోట్లకి మేఘ తక్కువ కోడ్ చేసింది. విశేషమేమిటంటే ఈ కాంట్రాక్టు లో మేఘ ఒకటే పాల్గొనటం. ఇది మొత్తం ఒక పక్క ప్లాన్ ప్రకారమే జరిగినట్లు తెలుస్తుంది. ఇందులో కేసీఆర్ తనవంతు పాత్ర కూడా పోషించాడు.