త్రాగునీటి ట్యాంకర్‌లో కాళ్ళు కడిగిన డ్రైవర్.. కేసు నమోదు..!

Sunday, July 5th, 2020, 02:06:00 AM IST


హైదరాబాద్‌లోని జలమండలి పరిధిలోని మూసాపేట్ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద తాగునీటి వాటర్ ట్యాంకర్‌లో నీటిన నింపే సమయంలో డ్రైవర్ ట్యాంకర్‌లోనే కాళ్ళు కడుకున్నాడు. అయితే ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

అయితే అసలే కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ డ్రైవర్ అలా కాళ్ళు కడగడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో జలమండలి అధికారులు కూడా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు సదరు డ్రైవర్‌పై కూకట్‌పల్లి పోలీసుస్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదయ్యింది.