స్వామీజీ ఆశ్రమంలో ఆయుధాలు ?

Friday, November 21st, 2014, 06:46:43 PM IST


వివాదాస్పద బాబా రాంపాల్ ను పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బాబా రాంపాల్ అరెస్ట్ అనంతరం పోలీసులు ఆశ్రమంలో సోదాలు నిర్వహించారు. అరెస్ట్ కు ముందు రోజు బాబా రాంపాల్ అనుచరులు పోలీసులపై నాటు బాంబులతో దాడి చేసిన విషయం తెలిసిందే. అసలు బాబా అనుచరుల దగ్గరకు బాబులు ఎలావచ్చాయి ? అనే అంశంపై పోలీసులు రాంపాల్ అరెస్ట్ అనంతరం సత్యలోక్ ఆశ్రమంలో సోదాలు చేశారు. ఈ సోదాలో పోలీసులకు ఆశ్చర్యపోయే నిజాలు వెలుగుచూశాయి.

ఆశ్రమంలో ప్రమాదకరమైన ఆయుధాలు బయటపడ్డాయి. ఆశ్రమంలో ఉన్నరెండు లాకర్లలో అధిక మొత్తంలో రైఫిళ్లను, ఎస్ఎల్ఆర్ రైఫిళ్లు మరియు 303 తుపాకిని పోలీసులు గుర్తించారు. ఆశ్రమంలో బాబా రాంపాల్ ఆసనానికి క్రింద ఒక స్టేర్ లో ఈ ఆయుధాలు బయట పడ్డాయి. ఎవరికీ అనుమానం రాకుండా.. ఈ స్టేర్ ను నిర్మించారు. అయితే… రాంపాల్ కు అసలు ఆయుధాలతో అవసరం ఏమిటనే దిశగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.