కేజ్రీవాల్ గాయకుడయ్యాడు!

Wednesday, December 3rd, 2014, 09:06:39 PM IST


ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ మంచి నాయకుడే కాదు ఆయనో మంచి గాయకుడు అనికూడా నిరూపించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డీకొట్టి… ఢిల్లీపై పీఠంపై ఆప్ జెండా ఎగరవేసిన కేజ్రీవాల్.. ఒక్క సారిగా వెలుగులోకి వచ్చారు. అనంతరం రెండు నెలలు కూడా అధికారంలో కొనసాగక ముందే రాజీనామా చేసి మరో సంచలనం సృష్టించారు. దీంతో ఢిల్లీలో మొన్నటి వరకు రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. అయితే… అన్ని పార్టీలు ఎన్నికలకు వెళ్లేందుకు సంసిద్దతను వ్యక్తం చేయడంతో ఎన్నికలలు నిర్వహించక తప్పని పరిస్థితి తలెత్తింది. ఇక ఢిల్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ నోయిడా ప్రాంతంలో ఉన్న రేడియో మిర్చి ఎఫ్ఎం స్టేషన్ కు వెళ్ళారు. ప్రజలకు చేరువ కావడానికి రేడియో ప్రచారాన్ని ఎంచుకున్నారు. ఇందుకోసం ఆయన రేడియో మిర్చి స్టేషన్ కు వెళ్లారు. అయితే అక్కడ ఆర్ జెలు, ఇతర సిబ్బంది ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. రేడియో మిర్చి స్టేషన్లో కేజ్రీవాల్ కల్ ఆజ్ ఔర్ కల్ అనే చిత్రంలోని పాటను పాడి అక్కడి వారిని అలరించారు.