అలా నిరూపించే దమ్ముందా.. చంద్రబాబు సవాల్ విసిరిన పోసాని..!

Tuesday, March 9th, 2021, 02:04:31 AM IST


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైకాపా నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వైకాపా తరపున ప్రచారం చేసిన పోసాని చంద్రబాబు నాయుడు ఫేక్ ముఖ్యమంత్రి అని, వ్యవస్థలను మేనేజ్ చేసి అయన సీఎం అయ్యేవారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నీచంగా మోసాలు చేస్తారని, ఆయనకు పదవిపై పిచ్చి అని ఎప్పుడూ సీఎం సీట్లో కూర్చోవాలనే ఆరాటపడుతుంటారని ఎద్దేవా చేశారు.

అంతేకాదు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉంటూ అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారని, ఎవరికీ మింగుడు పడని విధంగా ఆయన మాట్లాడుతుండడం నిజంగా సిగ్గుచేటు అని అన్నారు. సీఎం జగన్ ఎలా అవినీతి పరుడో నిరూపించాలని, ఈ విషయంలో చంద్రబాబుతో చర్చకు నేను సిద్దమని పోసాని చెప్పుకొచ్చారు. జగన్‌ అవినీతి పరుడని నిరూపిస్తే తాను చంద్రబాబు కాళ్లకు దండం పెట్టి, ఆయన ఫోటో మెడలో వేసుకుని రాష్ట్రమంతా తిరుగుతానని సవాల్‌ విసిరారు. చంద్రబాబు మాయమాటలను పట్టించుకోకుండా మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి ఓటు వేయాలని పోసాని విజ్ఞప్తి చేశారు. /