ప్రభాస్ పోలీస్ గా నటించేది అతని డైరెక్షన్ లోనేనా..?

Monday, January 4th, 2016, 01:07:55 PM IST


పవన్, మహేష్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి టాప్ హీరోలంతా ఇప్పటికే వెండి తెరపై పోలీస్ గా కనిపించేశారు. కానీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్కడే ఇప్పటి వరకూ పోలీస్ గెటప్ లో కనిపించలేదు. ఆరడుగుల ఎత్తు, సిక్స్ ప్యాక్ ఉన్న రెబల్ స్టార్ పోలీస్ గా కనిపించలేదే అనేదే ఆయన అభిమానుల భాద కూడా. ఈ భాదను తీర్చడానికే ప్రభాస్ బాహుబలి తరువాత ఓ సరికొత్త పోలీస్ గెటప్ లో కనిపించనున్నాడట.

ప్రస్తుతం బాహుబలి – 2 షూటింగ్ లో ఉన్న ప్రభాస్ అది పూర్తవగానే యూవి క్రియేషన్స్ నిర్మాణంలో ‘రన్ రాజా రన్’ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో ఓ పోలీస్ సినిమా చేస్తాడట. దర్శకుడు సుజిత్ కూడా ప్రభాస్ కోసం ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసినట్టు సమాచారం. రన్ రాజా రన్ సినిమా విడుదలప్పుడే ప్రభాస్, సుజిత్ తో సినిమా చేయాలనుంది అని కూడా అన్నాడు. దీన్నిబట్టి ప్రభాస్ నెక్స్ట్ సినిమా అతనితోనే అని సినీ వర్గాలు చెబుతున్నాయి.