బిగ్ న్యూస్: హేయ్ రామ్…వాళ్ళను కాపాడు – ప్రకాష్ రాజ్!

Friday, July 31st, 2020, 01:18:45 AM IST

కరోనా వైరస్ మహమ్మారి దేశం లో వేగంగా వ్యాప్తి చెందుతుంది. కరోనా వైరస్ భారిన పడటంతో చాలా మంది తమతమ పనులను సైతం వాయిదా వేస్తున్నారు.అయితే తాజాగా అయోధ్యా రామ మందిర నిర్మాణం కోసం భూమి పూజ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ భూమి పూజ వచ్చే నెల ఆగస్ట్ 5 న ఉండనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ అయోధ్యా కి చెందిన పూజారి కి కరోనా వైరస్ సోకినట్లు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తెలిపారు. అయితే ఈ కార్యక్రమం లో పాల్గొనాల్సి నటువంటి 16 మంది సెక్యూరిటీ సిబ్బంది కూడా కరోనా సోకినట్లు తెలుస్తోంది.

అయితే ఈ విషయాన్ని నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. హేయ్ రామ్…వాళ్ళను కాపాడు అంటూ ప్రకాష్ రాజ్ పోస్ట్ చేశారు. అంతేకాక జస్ట్ అస్కింగ్ అంటూ హ్యా ష్ ట్యాగ్ జత చేశారు. అయితే ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.