బీజేపీకి ఆ అవకాశం ఇవ్వొద్దు

Tuesday, October 28th, 2014, 03:19:34 PM IST


బీజేపికి అవకాసం ఢిల్లీ పీఠం అధిష్టించే అవకాశం ఇవ్వొద్దని…. రోజు సుప్రీం కోర్టును కోరినట్టు ప్రశాంత్ భూషణ్ తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. బీజేపికి కాంగ్రెస్ కాని, ఆప్ గాని మద్దతు ఇవ్వడం లేదని.. అటువంటి సమయంలో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపిని ఎలా ఆహ్వానిస్తారని ఆయన అన్నారు. బీజేపిని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తే.. రాజకీయ బేరసారాలు జరుగుతాయని.. అలాగే.. పార్టీ ఫిరాయింపులను బీజేపి ప్రోత్సహిస్తుందని.. ప్రశాంత్ భూషణ్ అన్నారు.

ప్రస్తుతం ఢిల్లీ రాష్ట్రపతి పాలనలో ఉన్న విషయం తెలిసిందే. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆప్ పార్టీ పట్టుమని రెండు నెలలు పరిపాలించముందే తప్పుకున్నది. దీంతో అప్పటి నుంచి ఢిల్లీ రాష్ట్రపతి పాలనలో ఉన్నది.