రోడ్లపై నడుస్తూ ఒబామా షాపింగ్!

Thursday, April 30th, 2015, 07:46:42 PM IST


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వాషింగ్ టన్ వీధుల్లో సరదాగా నడుస్తూ హల్ చల్ చేశారు. ఇక నిత్యం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ బిజీబిజీగా ఉండే ఒబామా కాసేపు హాయిగా అలా వీధుల్లో తిరుగుతూ, రెస్టారెంట్ కు వెళ్లి షాపింగ్ చేసి, దారిలో ఎదురైన వారిని పలకరిస్తూ సంతోషంగా గడిపారు. ఇక వైట్ హౌస్ వాయువ్య గేటు నుండి నేషనల్ టీచర్ ఆఫ్ ది ఇయర్ షానా పీప్లెస్ తో కలిసి బయటకు వచ్చిన ఒబామా నడక మొదలెట్టారు. అలాగే వైట్ షర్టు, బ్లాక్ టైతో ఒబామా నడుస్తూ ఈ రోజు చాలా బాగుంది అంటూ వ్యాఖ్యానించారు.

అనంతరం వైట్ హౌస్ ను దాటి హెచ్ స్ట్రీట్ కు వచ్చిన ఒబామా అక్కడ ఆసియా టీస్టాల్ ‘టియాసియం’ వద్ద ఉన్న వారిని అప్యాయంగా పలకరించి ‘ఈ రోజు చాలా బాగుంది… కాసేపు అలా నడవాలనుకున్నాను.. మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది’ అని వ్యాఖ్యానింఛి ముందుకు కదిలారు. అటు తర్వాత షాపులోకి వెళ్లి 7 నిమిషాల తర్వాత టీ కప్, ఒక పాకెట్ ను పట్టుకొచ్చిన ఒబామా అక్కడున్న చిన్నారులతో కాసేపు గడిపి తిరిగి వైట్ హౌస్ లోకి వెళ్ళిపోయారు.