ప్రధాని మోడికి నోటీసులు

Friday, September 26th, 2014, 01:09:26 PM IST


భారతప్రధాన మంత్రి నరేంద్రమోడి కి అమెరికాలోని న్యూయార్క్ కోర్ట్ నోటీసులు జారీ చేసింది. 2002 లో గుజరాత్ అల్లర్ల సందర్భంగా మోడికి అప్పట్లో అమెరికాను నిరాకించిన విషయం తెలిసిందే. కాగ, మోడీ ప్రధానమంత్రి అయిన తరువాత అమెరికా ప్రభుత్వం ఆయనకు రెడ్ కార్పెట్ వేసి మరీ స్వాగతం పలికింది. మోడీ రాక కోసం అక్కడి అమెరికన్ భారతీయులే కాకుండా.. ప్రభుత్వం కూడా వేయి కళ్ళతో వేచిచూస్తున్నది.

అయితే, 2002లో గుజరాత్ లో జరిగిన అల్లర్లపై న్యూయార్క్ లోని అలియన్స్ ఫర్ జస్టిస్ అండ్ అకౌంటబిలిటి దాఖలు చేసిన పిటిషన్ పై న్యూయార్క్ కోర్ట్ మోడీ కి నోటీసులు జారీ చేసింది. దీనిపై మూడు వారాలలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే, ఇప్పుడు దేశాధినేత అని, ఆయనకు ఈ కేసు వర్తించదని న్యాయ నిపుణులు అంటున్నారు. కాగ, ఈ నెల 28న మోడీ న్యూయార్క్ నగరంలో మేడిసన్ స్క్వేర్ గార్డెన్ వద్ద ప్రసంగించనున్నారు. ఆ సమయంలో నల్ల జెండాలతో నిరసనలు తెలియజేస్తామని అలియన్స్ ఫర్ జస్టిస్ అండ్ అకౌంటబిలిటి తెలిపింది.