నాంది సినిమా పై దిల్ రాజు ప్రశంశల వర్షం

Wednesday, February 24th, 2021, 11:24:46 AM IST

అల్లరి నరేష్ హీరో గా విజయ్ కనక మేడల దర్శకత్వం లో వచ్చినటువంటి నాంది చిత్రం కి అటు క్లాస్ ఆడియెన్స్ నుండి మాస్ ఆడియన్స్ వరకూ మంచి స్పందన లభిస్తోంది. థియేటర్ల వద్ద ప్రేక్షకుల హడావిడి ఇంకా కనిపిస్తూనే ఉంది. ఈ చిత్రం లో వరలక్ష్మి శరత్ కుమార్ నటన సైతం అద్భుతం గా ఉండటం తో అభిమానులు, ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ఈ చిత్రాన్ని చూసిన దిల్ రాజు ఒక మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ చిత్రం పై పొగడ్తల వర్షం కురిపించారు.

నా ఇరవై ఏళ్ల కెరీర్ లో తొలిసారి సినిమా తో నాకు సంబంధం లేకున్నా, సినిమా చూసి బాగా నచ్చి ఆ టీమ్ ను బాగా అప్రిషియేట్ చేయాలని అనుకున్నా అంటూ దిల్ రాజు అన్నారు. దర్శకుడు ఈ చిత్రాన్ని ఎన్నో ట్విస్తులు, టర్న్ లతో చక్కగా తెరకెక్కించాడు అని అన్నారు. లాయర్ గా వరలక్ష్మీ శరత్ కుమార్ అభినయం అందరినీ అలరించే విధంగా ఉంది అని అన్నారు.నరేష్ మంచి నటుడు అని మరొకసారి ఈ చిత్రం తో నిరూపించుకున్నాడు అని వ్యాఖ్యానించారు. ఒక మంచి టీం తో ఒక మంచి సినిమా తీస్తే ఆ కిక్కే వేరు అంటూ చెప్పుకొచ్చారు. డబ్బుతో పాటు గౌరవాన్ని తీసుకొచ్చే సినిమా ఇది అని దిల్ రాజు అన్నారు. అయితే దిల్ రాజు ఈ చిత్రం పై చేసిన వ్యాఖ్యలు నాంది సినిమా ను చూడని వారు కూడా చూడాలి అనేలా ఉన్నాయి అని చెప్పాలి.